RR: సరూర్ నగర్ రైతు బజార్‌కు ఈరోజు సెలవు ఉంటుందని ఈవో శ్రవంతి తెలిపారు. ప్రతి నెల 3వ బుధవారం రైతు బజార్‌కు సెలవు ఉంటుందన్నారు. ఈరోజు రైతు బజార్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని ఆమె పేర్కొన్నారు. గురువారం యథావిధిగా రైతు బజార్ కొనసాగుతుందని, ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.