ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెసింగ్ రూమ్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందజేశారు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ అవార్డును అందుకున్నాడు. తిలక్ మాట్లాడుతూ.. జట్టు విజయం కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటా అని వెల్లడించాడు.