వెన్ను నొప్పి తిరగబెట్టడంతో రెడ్ బాల్ క్రికెట్‌కు బ్రేక్ ఇవ్వాలని టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు BCCI సెలక్షన్ కమిటీకి లేఖ రాశాడు. అలాగే వచ్చే నెలలో విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీసుకు తనను పరిగణనలోకి తీసుకోవద్దని కోరాడు. కాగా IND-A vs AUS-A రెండో అనధికార టెస్ట్ నుంచి అయ్యర్ అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే.