VSP: ప్రజోపయోగిజితా ప్రయోజనాల కోసం విశాఖ జనసేన కార్పొరేటర్ పి. మూర్తి యాదవ్ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై బుధవారం మధ్యాహ్నం నుంచి ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు జరుపుతున్నారని, పర్యావరణ విధ్వంసాన్ని నిలిపివేయాలని ఆయన ఈ వ్యాజ్యంలో కోరారు.