TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 1.1KM పొడవున్న ఈ ఫ్లైఓవర్‌కు రెండు వైపులా ఆర్చ్ నిర్మించడానికి కూడా కమిటీ అంగీకరించింది. ఈ పేరు మార్పు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది.