TG: గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 27న నియామక పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శిల్పకళావేదికలో 562 మందికి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై సీఎస్ సమీక్షించారు. రేపటిలోగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.