అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీస్‌లో క్లోజ్డ్ డోర్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా హాజరయ్యారు. ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్ భేటీ కావడం ఇదే తొలిసారి. మరోవైపు ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాలో వరుస పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.