KNR: KDCC BANK ప్రధానం కార్యాలయంలో TCCBEA కరీంనగర్ యూనిట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయే చందమామ, రామ రామరామ ఉయ్యాలో.. రామనే శ్రీ రామ ఉయ్యాలో అంటూ మహిళలు బతుకమ్మ అడి పాడారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కే. రవీందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పీ. రమేష్, సీఈవో ఎన్. సత్యనారాయణ రావు, జీఎంలు శ్రీధర్, రియాజ్ పాల్గొన్నారు.