SRD: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో జిల్లా మొత్తం “ఎల్లో అలర్ట్” ఉన్నదని సంగారెడ్డి జిల్లా SP హరితోష్ పంకజ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రజలు తుఫాన్ సహాయక నిమిత్తం 100కు డయల్ చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగి పొర్లే వాగులు, వంకలను చూడడానికి వెళ్లకూడదు అని తెలిపారు. పోలీసులకు సహకరించి సమాచారం అందించాలని అన్నారు.