ELR: ఈ నెల 28న భద్రాచలంలో చలో భద్రాచలం ధర్మ యుద్ధం మహాసభను విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పిలుపునిచ్చింది. వేలేరుపాడు మండలం పాత పూచిరాలలో ఆ సంఘం సమావేశం నిర్వహించింది. మండల అధ్యక్షుడు సీతారామయ్య మాట్లాడుతూ.. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.