GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి శనివారం గుంటూరు వన్ టౌన్‌లోని సచివాలయంలో “సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు గిఫ్టుగా అందించిన జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు చేరాలంటే, కొనుగోలుదారులు గత, ప్రస్తుత ధరలను పోల్చి చూసుకోవాలని ఆయన సూచించారు.