తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ చేపట్టిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.