AP: కూచిపూడి, కొండపల్లి, ఏటికొప్పాక వంటి కళా కేంద్రాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గండికోట, అరకులో పర్యాటక ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. దసరా అంటే కోల్కతా, మైసూరే కాకుండా విజయవాడను గుర్తించేలా అభివృద్ధి చేస్తామని.. దేశంలోనే నంబర్ 1 సిటీగా మారుస్తామని చెప్పారు. రాయలసీమలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.