AP: కూటమి ప్రభుత్వం ఒక టీమ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీమ్‌లో ఏ ఒక్కరు తప్పు చేసినా చాలా నష్టపోతామని అన్నారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడితే కూటమి లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్నారు. ఎన్డీఏ సంకల్పం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. మోదీ, పవన్ సహకారంతో కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.