TVK పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మందికి పైగా మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.