CTR: పెనుమూరు మండలం రామకృష్ణపురం అవుట్‌స్కర్ట్స్‌లో శనివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానికంగా తయారు చేసిన 16 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు AP02CG5149 నంబరు గల బైక్ నడుపుతున్న ఎన్. రాజశేఖర్ (28)ను బాంంబులు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. కాగా, ఆయన్ను వెదురుకుప్పం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.