విశాఖ జిల్లా ఆనందపురం కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఫైనలియర్ విద్యార్థినులకు దసరా ఇంటర్న్‌షిప్‌లో భాగంగా 10 రోజుల పాటు ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమైన ఈ కార్యక్రమం 30న ముగుస్తుంది. వృత్తి విద్య ఉపాధ్యాయురాలు బి.స్వరాజ్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు రొట్టె, కేకులు, పేస్ట్రీ, కుకీస్ తయారీపై శిక్షణ ఇస్తున్నారు.