NDL: ఆత్మకూరు పట్టణానికి చెందిన మాజీ సైనికులు ఆర్.మల్లికార్జున్ సింగ్, వై.శివను రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) రైజింగ్ డే సందర్భంగా ఇవాళ ఘనంగా సన్మానించారు. కర్నూలు రైల్వేస్ ఇన్స్పెక్టర్ వి.రమణ, ఏఎస్ఐ డికె.ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొని దేశానికి వారు చేసిన విశేష సేవలను కొనియాడారు.