తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 22 మందిని స్థానిక కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.