ADB: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని కోరుతూ మండలంలోని పలు గ్రామాల నుంచి ఆదివాసీ తుడుందెబ్బ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడాలు ఎస్టీలుగా పరిగణించబడటంతో ఆదివాసీలకు నష్టం కలుగుతుందన్నారు. ఆదివాసి నాయకులు, మహిళలు తదితరులున్నారు.