అనంతపురం రేంజ్ డీఐజీ షిముషి, జిల్లా ఎస్పీ జగదీశ్ తిరుమల బ్రహ్మోత్సవాల విధుల్లో పాల్గొన్నారు. రేపు జరగనున్న శ్రీవారి గరుడసేవ మహోత్సవం సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో తిరుపతి ఎస్పీతో కలిసి పోలీసులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.