విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నుంచి దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయని పరిపాలనా అధికారి రమేష్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా, ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు సహా పలు వినోద కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.