WNP: కొత్తకోట పట్టణంలో భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థ గృహాల్లో ఉండటం ప్రమాదకరమని మున్సిపల్ కమిషనర్ ఏ.సైదయ్య శనివారం హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని, పగుళ్లు కనిపించిన వెంటనే అధికారులకు చెప్పాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీరు ఉంటే తీసివేయాలని లేకుంటే రోగాలు వ్యాపిస్తాయని తెలిపారు.