BPT: బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో జరిగిన హత్య కేసును బాపట్ల రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులోని నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ఉమా మహేశ్వర్ అభినందించారు.