ELR: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 6,14,879 కార్డులకు శుక్రవారం నాటికి 5,67,674 92శాతం కార్డులను పంపిణీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ల ద్వారా కార్డులను ఆయా కార్డుదారులకు అందజేశారు. ఇంకా 47,205 కార్డుదారులు అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరగుతోందని జిల్లా అధికారులు తెలిపారు.