ATP: గుంతకల్లు పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో శనివారం ప్రమాదవశాత్తు ఓ భవనం పైకప్పు మీద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు స్థానిక ఏకలవ్య నగర్‌కు చెందిన వెంకటరమణగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.