ప్రముఖ పంజాబీ సింగర్ రాజ్వీర్ జవాండాకు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో ఆయనను వెంటనే మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. బైక్పై సిమ్లా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆయన త్వరగా కోలుకోవాలని సహచర గాయకులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.