KRNL: నీతి, నిజాయితీకి నిలువుటద్దం కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ జిలాని బాష అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయభాస్కర్ రెడ్డి 24వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో ఆయన మచ్చలేని నేతగా, చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.