TG: గత ప్రభుత్వ పెద్దలు కడుపునిండా విషం పెట్టుకుని యువతను దెబ్బతీయాలని చూశారని CM రేవంత్ ఆగ్రహించారు. ‘మేము దృఢ సంకల్పంతో మీకు మంచి చేయాలని ఉద్యోగ నియామకాల కార్యక్రమం పెట్టాం. నేను ఉద్యోగాలు అమ్ముకున్నాని ఆరోపించారు. మీ గుండెలపై చేయి వేసుకుని చెప్పండి.. నేను ఎవరినైనా కలిసి కనీసం ఛాయ్ తాగానా? కేవలం మీ భవిష్యత్తు కోసమే కొట్లాడాను’ అని పేర్కొన్నారు.