NZM: కోటగిరి మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందరూ ఒకచోట చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ.. చిన్నారులు కోలాటాలాతో నృత్యాలు చేస్తూ సంబరాలను జరుపుకున్నారు. అనంతరం గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.