VSP: తమను విధులకు వెళ్లకుండా అడ్డుకున్న సీఐటీయూ నాయకులపై క్రిమినల్ కేసు పెట్టనున్నట్లు జీవీఎంసీ భీమిలి జోనల్ కమిషనర్ ఒమ్మి అయ్యప్పనాయుడు శనివారం తెలిపారు. తగరపువలస ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద బడ్డీల తొలగింపును అన్యాయమంటూ శుక్రవారం సీఐటీయూ నాయకులు తమతో సహా సిబ్బందిని అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు.