NLG: గుర్రంపూడు మండలం కొప్పోలుకు చెందిన ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మహ్మద్ జానిమియా (జానీ) విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ అవార్డును అందుకున్నారు. శనివారం నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. ఇంటలిజెన్స్ సమాచారాన్ని సకాలంలో సమర్పించడంలో ఆయన చూపిన అంకితభావం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు.