W.G: ఎలుకల నివారణ వలన అధిక దిగుబడులు సాధించవచ్చని మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడిలో సామూహిక ఉచిత ఎలుకల మందు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా పంటపొలాల వద్ద బ్రోమోడైలిన్, నూకలు, నూనెతో కలిపి తయారు చేసిన ఎలుకల మందును రైతులకు ఏవో రమేశ్ నాయుడు అందించారు. ఇందులో సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసు పాల్గొన్నారు.