GNTR: తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి వచ్చిన మంత్రికి కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ వారాహి దేవి అలంకారంలో ఉన్న వాసవి మాతను, శ్రీ కామాక్షి దేవి అలంకారంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు.