TG: గత పాలకులు TGPSCని అంగడి సరకుగా మార్చారని CM రేవంత్ మండిపడ్డారు. ‘RMP డాక్టర్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వేశారు. ఆనాడు వారు నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బఠానీల్లా అమ్మారు. మేము అధికారంలోకి రాగానే TGPSCని ప్రక్షాళన చేశాం. ఉన్నత విద్య, అనుభవం ఉన్న మహేందర్ రెడ్డిని కమిషన్ ఛైర్మన్గా నియమించాం’ అని అన్నారు.