నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీలో విలన్‌గా మోహన్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలన్ పాత్రలో నటించడం తనకు ఎప్పుడూ ఎగ్జైటింగ్‌గానే ఉంటుందని ఆయన ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది మార్చ్ 26న విడుదల కానున్న ఈ మూవీలో షికంజా మాలిక్‌గా తనదైన స్టైల్లో హీరోతో పోరాడతానని పేర్కొన్నాడు.