నంద్యాలలో నంది రైతు సమాఖ్య, మాతృభాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు శేషఫణి, పీవీ సుబ్బయ్యలను ఇవాళ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు, డాక్టర్ ఖాదర్ బాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే దారి దీపాల వంటి వారు ఉపాధ్యాయులని పేర్కొన్నారు.