VSP: డొమెస్టిక్ పర్యాటకంతో పాటు, అంతర్జాతీయ పర్యాటకానికి చిరునామాగా విశాఖను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం వీఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని కలెక్టర్ తెలిపారు.