NRPT: నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ కంట్రోలర్ శ్రీనివాస్ కుమార్తె వీణ, గ్రూప్-1 తుది ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసిన వీణ, చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో కష్టపడింది. రెండేళ్ల శిక్షణ తర్వాత, గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంకు సాధించింది.