JGL: జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో రూ. 20లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో నిర్మించబడిన కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆధునీకరణకు కృషి చేస్తోందని అన్నారు. డీఈ మిలింద్, తహశీల్దార్ వరంధన్, మాజీ సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.