AP: టమాటా ధరలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. కర్నూల్(D) పత్తికొండ మార్కెట్లో ఇవాళ KG టమాటా కనిష్ఠంగా 50 పైసలు, గరిష్ఠంగా రూ.1 పలికింది. వ్యాపారులు టమాటలను కొనేందుకు ముందుకు రాకపోవడంతో నిరాశపడిన రైతులు మార్కెట్లోనే పడేసి వెనుదిరిగారు. పెట్టుబడి ఖర్చు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.