PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బాపూజీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. CP మాట్లాడుతూ.. బాపూజీ ఐదు దశాబ్దాలుగా తెలంగాణ కోసం నిరంతరంగా పోరాడారని, ఆయన త్యాగాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.