KMM: కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై భారీ కొంత ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఈ గుంత కారణంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనాలు స్కిడ్ అయ్యి కింద పడుతున్నాయని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతను పూడ్చివేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.