MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అర్బన్, రూరల్‌కి చెందిన 77 మంది లబ్ధిదారులకు రూ.77,08,932 విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను MLA వినోద్ పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచుల వివాహాలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు వెన్నంటి నిలుస్తాయని అన్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.