AP: తల్లికి వందనం సాయం చేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలిచామని సీఎం చంద్రబాబు అన్నారు. బాగా చదువుకున్న వాళ్లు ఒక సంతానంతోనే ఆపేస్తున్నారని తెలిపారు. ఎందరు పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు. వంటగదిలో తమ అమ్మ బాధలు చూశానని.. అందుకే దీపం పథకం తెచ్చానన్నారు. అప్పట్లో దీపం పథకం కింద 52 లక్షల మందికి కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.