KMM: శివాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ అన్నారు. శనివారం సత్తుపల్లి వెంగళరావు కాలనీలో ఉన్న శివాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. పనుల యొక్క వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు.