NDL: ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, పత్తి, మిరప తదితర పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని CPI(ML) పార్టీ డిమాండ్ చేసింది. ఇవాళ నందికొట్కూరులోని కార్యాలయంలో నాయకుల సమావేశం జరిగింది. జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో రైతులు వేసిన పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.