ASR: మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలు, సమాజానికి, యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతోందని ఈగిల్ సీఐ డీ.నాగార్జున అన్నారు. శనివారం చింతపల్లిలో రోడ్డు రోడ్డు వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని చెప్పారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.