దసరా పురస్కరించుకొని ‘మిరాయ్’ మూవీ మేకర్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దసరా కానుకగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్కీన్లలో టికెట్ ధరలను తగ్గిస్తూ.. బాల్కనీ రూ.150, ఫస్ట్‌క్లాస్ రూ.105గా నిర్ణయించారు. తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే.