NDL: చాగలమర్రిలో ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక RCM స్కూలులో కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఇవాళ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ప్రాముఖ్యత గురించి వివరించామన్నారు. స్త్రీలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై వివరించి అనుమానితులకు పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.